
బిజినెస్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అదే సమయంలో భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపులు, ఇళ్లు మరియు భూములు కోల్పోయిన బాధితులకు రెంటల్ అలవెన్స్ మంజూరు, కొత్త పూలింగ్ గ్రామాల అర్హులైన రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!