
టెక్నాలజీ

హర్యానాలోని గురుగ్రామ్‌లో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారికి చికిత్స అందిస్తుండగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం మృతులు గ్యాంగ్‌స్టర్ దీపక్ నందాల్ ముఠాకు చెందిన సభ్యులు. ఎన్‌కౌంటర్‌కు ముందు ఐదుగురు గ్యాంగ్‌స్టర్లు ఓ వ్యాపారి ఇంటిపై కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గురుగ్రామ్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, ముఠాకు సంబంధించిన ఇతర సభ్యుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!