
బిజినెస్

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభలో పాల్గొని రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు అర్హులైన రైతులకు కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రైతు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై కూడా ఆయన ప్రసంగించే అవకాశం ఉంది.
గత తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా పథకం కింద రూ.9 వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!