

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నాలెజినోవా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు.
మోదీతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న అన్నా లెజినోవా.. “ప్రధాని మా ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజును జీవితంలో మర్చిపోలేను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశాను” అని పేర్కొన్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు మోదీ కూడా ఎక్స్‌లో స్పందిస్తూ పవన్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చూపిన ఆప్యాయత జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!