
షోస్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని SMS 1 విభాగంలో ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు బయటకు రావడంతో అక్కడ ఉన్న కార్మికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులు అదే రోజు సీడీసీని తిరిగి ప్రారంభించగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
గతంలో ఇదే విభాగంలో జరిగిన ప్రమాదంలో కొంతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉంది. దీంతో తాజా ప్రమాదం కార్మికుల్లో ఆందోళన కలిగించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. ద్రవ ఉక్కు లీకేజీకి దారితీసిన పరిస్థితులు, యూనిట్లో భద్రతా చర్యలపై ఇప్పుడు దృష్టి సారించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!