

దేశ న్యాయవ్యవస్థలో అరుదైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తొలిసారిగా ఒకేసారి నాలుగు హైకోర్టులకు మహిళా ప్రధాన న్యాయమూర్తులు నేతృత్వం వహించనున్నారు. ప్రస్తుతం గుజరాత్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ రేవతి మోహితె డెరె, జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యానికి కీలక మైలురాయిగా భావించబడుతోంది.
పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కిం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మీనాక్షి ఎం రాయ్‌ను నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎస్. కుమార్ సాహు జూన్ 4న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ రాయ్ నియామకం జరిగితే, దేశంలో ఒకేసారి నాలుగు హైకోర్టులకు మహిళా ప్రధాన న్యాయమూర్తులు నేతృత్వం వహించే చారిత్రక పరిస్థితి ఏర్పడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!