
జనరల్

ముంబై లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో భారీ రికార్డు నమోదైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త లీనా గాంధీ తేవారీ వర్లీలోని సముద్రతీరానికి ఆనుకుని ఉన్న రెండు విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లను రూ.700 కోట్లకుపైగా కొనుగోలు చేసినట్లు సమాచారం. చదరపు అడుగుకు దాదాపు రూ.3 లక్షల విలువ పలికిన ఈ డీల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ భారీ కొనుగోలు ముంబైలో అల్ట్రా లగ్జరీ గృహాలకు పెరుగుతున్న డిమాండ్‌ను మరోసారి స్పష్టంచేస్తోంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటైన న్యూయార్క్‌తో పోల్చదగిన స్థాయికి ముంబై చేరుకుందనే అభిప్రాయాన్ని ఈ ఒప్పందం బలపరుస్తోంది. అత్యంత సంపన్నుల పెట్టుబడులకు ముంబై ఇప్పటికీ ప్రధాన గమ్యస్థానంగా కొనసాగుతోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!