

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన ఇద్దరు ఆదివాసీ అభిమానులు కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలనే ఆకాంక్షతో సుమారు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఆటో డ్రైవర్ జాడే తిరుపతి, హోటల్ కార్మికుడు దుర్గం శంకర్ 11 రోజుల పాటు రోజుకు సగటున 25 కిలోమీటర్లు నడిచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో కేసీఆర్‌ను కలిసే అవకాశం వారికి లభించింది.
ఎర్రవల్లిలో కేసీఆర్ వారిని ఆప్యాయంగా ఆహ్వానించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేదా వినతిపత్రం లేకుండా కేవలం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోనే పాదయాత్ర చేసినట్లు అభిమానులు తెలిపారు. వారి అభిమానాన్ని, పట్టుదలను అభినందించిన కేసీఆర్, “మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి” అంటూ వారిని ప్రోత్సహించారు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!