
జనరల్

తిరుమల వెంకటేశ్వర దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. సర్వదర్శనానికి ప్రస్తుతం సుమారు 30 గంటల సమయం పడుతుండగా, భక్తులు ఐదు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. తీవ్ర ఎండల కారణంగా రింగ్ రోడ్డులో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
క్యూలైన్లలో సరైన ఆహారం, తాగునీటి సదుపాయాలు అందడం లేదని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలు అధికారులు దర్శన క్యూలైన్లపై సరైన సమాచారం ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం, శుక్రవారం ప్రత్యేక దినాలు కావడంతో మరో మూడు రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గదులు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!