

వ్యవసాయ, ఆహార రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న న్యూట్రిఫ్రెష్ సంస్థ దక్షిణ భారతదేశంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 2028 మార్చి నాటికి సుమారు 150 ఎకరాల్లో వాతావరణ నియంత్రిత వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.200–225 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో రూ.75 కోట్ల వరకు కంపెనీ సొంతంగా పెట్టుబడి పెట్టనుండగా, మిగిలిన మొత్తాన్ని రైతు భాగస్వాముల ద్వారా సమకూర్చుకోనుంది. దక్షిణాది ప్రధాన నగరాల్లో నియంత్రిత వాతావరణ వ్యవసాయ కార్యకలాపాలను విస్తరించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం.
న్యూట్రిఫ్రెష్ ఇప్పటికే బెంగళూరులో 25 ఎకరాల్లో వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోనూ విస్తరణకు శ్రీకారం చుట్టింది. 2027 మార్చి నాటికి హైదరాబాద్‌లో మరో 25 ఎకరాలను తన కార్యకలాపాలకు జోడించుకోవాలని భావిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో దశలవారీగా విస్తరిస్తూ 2028 మార్చి నాటికి మొత్తం 150 ఎకరాల్లో వాతావరణ నియంత్రిత వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత పెట్టుబడితో పాటు రైతుల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సంస్థ యోచిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!