

భారత్ వస్తు, సేవల ఎగుమతులు అక్టోబర్ 2026లో సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ నెలలో మొత్తం ఎగుమతుల విలువ 89.99 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది అక్టోబర్‌లో నమోదైన 69.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 29.9 శాతం అధికం. ఇదే సమయంలో దిగుమతులు కూడా పెరిగాయి. గతేడాది అక్టోబర్‌లో 94.42 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈసారి 110.07 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయినప్పటికీ వాణిజ్య లోటు 25.15 బిలియన్ డాలర్ల నుంచి 20.09 బిలియన్ డాలర్లకు తగ్గింది.
అక్టోబర్‌లో వస్తు, సేవల ఎగుమతులు ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. వస్తూత్పత్తుల ఎగుమతుల వృద్ధి ఐదేళ్ల గరిష్ఠాన్ని తాకిందని పేర్కొన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వస్తూత్పత్తుల ఎగుమతులు గతేడాది అక్టోబర్‌లోని 34.11 బిలియన్ డాలర్ల నుంచి 45.06 శాతం పెరిగి 49.47 బిలియన్ డాలర్లకు చేరాయి. సేవల ఎగుమతులు కూడా 35.17 బిలియన్ డాలర్ల నుంచి 40.51 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, రంగాల్లో ఎగుమతులు పుంజుకున్నాయని ఆయన వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!