

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా కొనసాగిస్తూ, రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మార్పు వల్ల రాష్ట్రాల ప్రాతినిధ్య నిష్పత్తిని యథాతథంగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లు ప్రధాన రాజకీయ అంశంగా మారింది. అధికార, ప్రతిపక్షాలు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండగా, వివిధ రాజకీయ పార్టీలు తమ వైఖరిపై అంతర్గతంగా చర్చలు కొనసాగిస్తున్నాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్షాలు కూడా తమ కార్యాచరణను రూపొందిస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే, భవిష్యత్ లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం కావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!