

ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇవాళ ఉదయం గుడ్ రిటర్న్స్ వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,880గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,45,640గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,030గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,790గా ఉంది.
మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,94,900గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,84,900గా నమోదైంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,94,900గా ఉండగా, బెంగళూరులో రూ.2,84,900గా ఉంది.
గమనిక: బంగారం కొనుగోలు చేసే ముందు ఈరోజు ధరలను తప్పనిసరిగా పరిశీలించండి. మార్కెట్ మార్పులను గమనించి సరైన సమయంలో కొనుగోలు చేయండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!