

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ముందుకు సాగుతున్నాయన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ వారం ప్రారంభంలో స్థిరంగా ఉన్న పసిడి ధరలు నిన్న తగ్గుదల నమోదు చేయగా, బుధవారం కూడా అదే ధోరణి కొనసాగింది.
ఈరోజు ఉదయం 6:30 గంటల నాటికి హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,990, 22 క్యారెట్లు రూ.1,31,990, 18 క్యారెట్లు రూ.1,07,990గా నమోదైంది. తెలంగాణలో వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతిలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,990గా ఉండగా, ఢిల్లీ, జైపూర్, లఖ్నవూలో రూ.1,44,140గా నమోదైంది. అంతర్జాతీయ పరిణామాలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బట్టి బంగారం ధరల్లో రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గమనిక: బంగారం ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మీ సమీప జ్యువెలర్ లేదా అధికారిక వనరుల ద్వారా తప్పనిసరిగా తెలుసుకోండి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!