
సినిమాలు

అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలపై వచ్చిన వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజులోనే బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతం లేదా 4.34 డాలర్లు పడిపోయి ప్రస్తుతం బ్యారెల్‌కు 79.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గే అవకాశంపై పెట్టుబడిదారులు సానుకూలంగా స్పందించడంతో చమురు ధరల్లో ఈ క్షీణత నమోదైంది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమెరికా-ఇరాన్ మధ్య అధికారిక ఒప్పందం కుదిరితే ఇరాన్ నుంచి ప్రపంచ మార్కెట్‌కు చమురు సరఫరా పెరిగే అవకాశం ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!