
రాజకీయాలు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రదీప్ రావత్ మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రతినాయకుడిగా, విలక్షణ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన గొప్ప నటుడిగా ఆయనను కొనియాడారు.
‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాల్లో ప్రదీప్ రావత్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్.. ఆయన అంకితభావం, నటన పట్ల నిబద్ధత ఎప్పటికీ స్మరణీయమని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొంటూ, ప్రదీప్ రావత్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!