

దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు అక్టోబర్‌లో గణనీయంగా పెరిగాయి. రోజువారీ సగటు లావాదేవీల విలువ తొలిసారిగా రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటింది. ఈ నెలలో మొత్తం యూపీఐ చెల్లింపుల విలువ రూ.31.53 లక్షల కోట్లకు చేరింది. నిత్యావసర కొనుగోళ్లతో పాటు పండగ సీజన్‌లో అధిక విలువ కలిగిన కొనుగోళ్లకు కూడా డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా వినియోగించడం ఈ వృద్ధికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో మొత్తం 2,547 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. సెప్టెంబర్‌లో నమోదైన 2,407 కోట్లతో పోలిస్తే ఇవి 5.8 శాతం పెరిగాయి. లావాదేవీల విలువ పరంగా 7.4 శాతం వృద్ధి నమోదైంది. ఇక రోజువారీ సగటు లావాదేవీల సంఖ్య 2.5 శాతం పెరిగి 82.2 కోట్లకు (822 మిలియన్లు) చేరింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం నిరంతరం విస్తరిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!