

యునైటెడ్ కింగ్‌డమ్‌తో భారతదేశం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రభావం ఆటోమొబైల్ రంగంలో కనిపించనుంది. ముఖ్యంగా Jaguar Land Rover (జేఎల్‌ఆర్) వాహనాల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా దిగుమతి సుంకం 110% నుంచి సుమారు 30%కు తగ్గనుంది. ఈ లాభాన్ని వినియోగదారులకు అందించేందుకు జేఎల్‌ఆర్ సిద్ధమవుతోంది. ఈ నెల 20 తర్వాత తగ్గిన ధరల వివరాలను డీలర్లకు తెలియజేస్తామని సమాచారం.
మోడల్‌ను బట్టి వాహనాల ధరలు 13% నుంచి 15% వరకు, అంటే సుమారు రూ.40 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు తగ్గే అవకాశముంది. ప్రస్తుతం రూ.4.25 కోట్ల ధరలో ఉన్న టాప్ ఎండ్ మోడల్ రేంజ్ రోవర్ ఎస్‌వీ 4.4 ధర రూ.63 నుంచి రూ.75 లక్షల వరకు తగ్గొచ్చని అంచనా. అలాగే రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ ధర కూడా సుమారు రూ.40 లక్షల మేర తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను కూడా కంపెనీ పరిచయం చేయనుంది. దీని ధర సుమారు రూ.2.05 కోట్లుగా ఉండొచ్చని సమాచారం.
అయితే అన్ని మోడళ్ల పై ఈ ధర తగ్గింపు వర్తించదు. స్లొవేకియాలో పూర్తిగా తయారయ్యే ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి వాహనాల ధరలో వెంటనే మార్పు ఉండకపోవచ్చు. అలాగే భారతదేశంలో తయారయ్యే మోడళ్ల ధరలు కూడా యథాతథంగా ఉండనున్నాయి. కారణం ఈ సుంకం తగ్గింపు ప్రయోజనం పూర్తిగా దిగుమతి అయ్యే, అధిక సామర్థ్యం గల ఇంజిన్ వాహనాలకే వర్తించడం. ఇక బ్రిటిష్ పౌండ్‌తో పోలిస్తే రూపాయి విలువ గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 13% పడిపోవడం వల్ల ఈ సుంకం లాభం కొంత మేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
.webp&w=3840&q=75)











.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!