

టయోటాకిర్లోస్కర్ మోటార్ భారత్‌లో తన ఉనికిని మరింత విస్తరించేందుకు మహారాష్ట్రలో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలోని బిడ్కిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్మించనున్న ఈ ప్లాంట్‌కు ఏడాదికి ఒక లక్ష వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉండనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2,800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా, 2029 తొలి అర్ధభాగంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. భారత మార్కెట్లో ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ప్రధానంగా కొత్త ఎస్యూవీ మోడళ్లను తయారు చేయనున్నారు. భవిష్యత్తులో ఈ కేంద్రం ఎగుమతుల హబ్‌గా కూడా మారే అవకాశముందని టయోటా వెల్లడించింది. ఈ పెట్టుబడితో మహారాష్ట్ర ఆటోమొబైల్ హబ్‌గా మరింత బలపడుతుందని కంపెనీ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!