
జనరల్

స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణలతో నమోదైన కేసులో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గతంలో నాంపల్లి కోర్టు ఎమ్మెల్సీలను అరెస్ట్ చేయవద్దని, రిమాండ్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్‌ను ఎమ్మెల్సీలు అసభ్య పదజాలంతో దూషించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై కూడా దాడి చేశారని పీపీ వాదించారు. నాంపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని పోలీసులు కోరగా, ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని ఎమ్మెల్సీలను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!