

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిన్న విడుదల చేసిన అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) తాజా జాబితాలో టాటా సన్స్ పేరును కొనసాగించింది. అయితే, ఎన్‌బీఎ్‌ఫసీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవాలంటూ టాటా సన్స్ ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ దరఖాస్తు పరిశీలనలో ఉందని తెలిపినా, నిర్ణయం ఎప్పటిలోగా తీసుకుంటారన్న విషయాన్ని వెల్లడించలేదు.
ఆర్థిక వ్యవస్థకు కీలకమైన, భారీ ఆస్తులు కలిగిన 17 ఎన్‌బీఎ్‌ఫసీలు, కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలను ఆర్‌బీఐ ఈ జాబితాలో చేర్చింది. మార్చి చివరి నాటికి టాటా సన్స్ ఆస్తుల విలువ రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంది. ప్రస్తుతం టాటా సన్స్ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC)గా నమోదై ఉంది.
టాటా గ్రూప్‌కు హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్, టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టైటాన్ వంటి అనేక లిస్టెడ్ సంస్థల్లో ప్రధాన ప్రమోటర్‌గా ఉంది. 2022లో మొదటిసారిగా అప్పర్ లేయర్ జాబితాలో చేర్చిన తర్వాత, కంపెనీపై మరింత కఠినమైన పాలన, పెట్టుబడి, సమాచార బహిర్గత నిబంధనలు అమల్లో ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!