

భారతదేశపు అగ్రగామి సమగ్ర విద్యుత్ సంస్థ టాటా పవర్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM)తో కలిసి తెలంగాణలో తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్‌ను హైదరాబాద్‌లోని ఐలాబ్స్ సెంటర్‌లో ప్రారంభించింది. హైటెక్ సిటీ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ హై-స్పీడ్ ఛార్జింగ్ కేంద్రం నగరంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. వ్యక్తిగత ఈవీ యజమానులు, కమర్షియల్ ఫ్లీట్ నిర్వాహకులు, క్యాబ్ సేవలు, నగరాల మధ్య ప్రయాణించే వారు, కార్పొరేట్ ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు.
మొత్తం 360 కిలోవాట్ల ఛార్జింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో మూడు 120 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్లు ఉన్నాయి. వీటి ద్వారా ఒకేసారి ఆరు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ అందించవచ్చు. 24 గంటల పాటు అందుబాటులో ఉండే ఈ సదుపాయం వల్ల ఛార్జింగ్ సమయం తగ్గడమే కాకుండా, వినియోగదారులకు వేగవంతమైన, విశ్వసనీయమైన సేవలు లభిస్తాయి. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!