11, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చమురు ధరల తగ్గుదలతో స్టాక్ మార్కెట్‌లో జోరు

Writer: Pooja 10:22 AM, 11 నవంబర్, 2026
చమురు ధరల తగ్గుదలతో స్టాక్ మార్కెట్‌లో జోరు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలు, ముడి చమురు ధరల తగ్గుదలతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపైనా కనిపించింది. సెన్సెక్స్ ఏకంగా 1,300 పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాభపడింది. ఈ ర్యాలీతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.513 లక్షల కోట్లకు చేరింది. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 1,347 పాయింట్లు పెరిగి 82,454 వద్ద, నిఫ్టీ 355 పాయింట్లు లాభపడి 25,400 వద్ద ట్రేడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా 7 పైసలు బలపడి 93.70 వద్ద కొనసాగింది.

నిఫ్టీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకీ షేర్లు లాభాలతో రాణించాయి. హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇండిగో షేర్లు 5 శాతానికి పైగా పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే అంచనాలతో ముడి చమురు ధరలు దిగిరావడం మార్కెట్లకు ప్రధానంగా కలిసొచ్చింది. మంగళవారం ట్రేడింగ్‌లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు చేరి మూడు నెలల కనిష్ఠాన్ని తాకింది. బుధవారం బ్రెంట్ క్రూడ్ ధర స్వల్పంగా పెరిగి 92 డాలర్లకు చేరినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి కొనసాగింది.

విదేశీ సంస్థాగత మదుపర్లు దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు కొనసాగించడం కూడా సూచీలకు మద్దతుగా నిలిచింది. మంగళవారం ఒక్కరోజే విదేశీ మదుపర్లు రూ.7,212 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. పలు కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడం కూడా మార్కెట్ ఉత్సాహాన్ని పెంచింది. మరోవైపు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. జపాన్ నిక్కీ 0.8 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.6 శాతం మేర లాభపడ్డాయి. చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్ల భారీ లాభాలకు దోహదపడ్డాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..

బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులకు కేంద్రం బ్రేక్

బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులకు కేంద్రం బ్రేక్

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వివాదం.. విచారణకు బోర్డు ఆదేశం!

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వివాదం.. విచారణకు బోర్డు ఆదేశం!

వాహనాల కొనుగోలుపై కేంద్రం కొత్త రూల్స్

వాహనాల కొనుగోలుపై కేంద్రం కొత్త రూల్స్

భారీగా తగ్గిన వెండి ధరలు

భారీగా తగ్గిన వెండి ధరలు

స్టార్టప్‌లకు పెట్టుబడులే లక్ష్యంగా హైదరాబాద్‌లో హెచ్‌ఈఎస్‌-2026 సదస్సు

స్టార్టప్‌లకు పెట్టుబడులే లక్ష్యంగా హైదరాబాద్‌లో హెచ్‌ఈఎస్‌-2026 సదస్సు

ట్యాగ్లు
దేశీయ స్టాక్ మార్కెట్సెన్సెక్స్ లాభాలునిఫ్టీ ర్యాలీముడి చమురు ధరలువిదేశీ మదుపర్లుమార్కెట్ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య
సినిమాలు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ
జనరల్

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం
రాజకీయాలు

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!