

సంచలన ఐపీవోతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ షేర్లు వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. దీంతో కేవలం మూడు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకుపైగా (సుమారు రూ.52 లక్షల కోట్లు) కరిగిపోయింది.
సోమవారం స్పేస్‌ఎక్స్ షేరు మరో 16 శాతం క్షీణించి 154.60 డాలర్ల వద్ద ముగిసింది. కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి ఇదే. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో షేరు మొత్తం 23 శాతం పడిపోయింది. దీంతో మార్కెట్ విలువ భారీగా తగ్గినా కంపెనీ మొత్తం విలువ ఇంకా 2 ట్రిలియన్ డాలర్లకు పైగానే ఉంది.ఏఐ రంగంలో విస్తరణ కోసం స్పేస్‌ఎక్స్ భారీ మొత్తంలో నిధులు సమీకరించేందుకు బాండ్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల కంపెనీపై అప్పుల భారం పెరిగే అవకాశం ఉందని, ఏఐ పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇస్తాయా అనే సందేహాలు కూడా ఇన్వెస్టర్లలో వ్యక్తమయ్యాయి. దీంతో షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!