

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ 61వ పుట్టినరోజు వేడుకల కోసం ముంబయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాంద్రాలోని ఆయన నివాసం ‘మన్నత్’ వద్ద భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేయగా, అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బాంద్రా-వర్లీ సీ లింక్ సమీపంలో ప్రత్యేక లైటింగ్ ప్రదర్శన ఏర్పాటు చేయడం వేడుకలకు మరింత ఆకర్షణగా నిలుస్తోంది. నగరంలో ఇప్పటికే పుట్టినరోజు సందడి నెలకొంది.
ఇదిలా ఉండగా, షారుక్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘కింగ్’ నుంచి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ప్రత్యేక అప్‌డేట్ వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి తొలి పాట లేదా టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ పుట్టినరోజున ‘కింగ్’ మూవీకి సంబంధించిన సర్‌ప్రైజ్ ఉంటుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!