

రష్యా నుంచి భారత్కు దిగుమతయ్యే వస్తువుల పరిమాణం గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది జనవరిలో దిగుమతులు సుమారు 40 శాతం వరకు పడిపోయినట్లు సమాచారం. ముఖ్యంగా రష్యా ముడి చమురు కొనుగోళ్లలో భారీ కోత నమోదైంది. దేశీయ శుద్ధి కర్మాగారాలు రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
గత ఏడాది జనవరిలో భారత్ రష్యా నుంచి 4.81 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకోగా, ఈ సంవత్సరం అదే కాలంలో అది 2.86 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2022 నుంచి రష్యా తక్కువ ధరలకు ముడి చమురు అందించడంతో భారత్లో ఆ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. అయితే పాశ్చాత్య దేశాల ఆంక్షల ఒత్తిడి, అలాగే యునైటెడ్ స్టేట్స్తో కొనసాగుతున్న వాణిజ్య చర్చల ప్రభావంతో ఇటీవలి కాలంలో ఈ కొనుగోళ్లు మందగించినట్లు భావిస్తున్నారు.
ఇటీవల భారత్–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రష్యా ముడి చమురు కొనుగోలు అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ హామీ ఇచ్చిందని అమెరికా ప్రకటించగా, దీనిపై భారత్ స్పందిస్తూ దేశీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!