

దేశంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 (20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్)పై వాహనదారుల్లో నెలకొన్న ఆందోళనలకు బీమా సంస్థలు స్పష్టత ఇచ్చాయి. పాత వాహనాల్లో E20 వాడితే బీమా వర్తించదన్న ప్రచారం పూర్తిగా తప్పుదారి పట్టించేదని తెలిపాయి.
2023 ఏప్రిల్‌కు ముందు తయారైన వాహనాల్లో E20 ఇంధనం వాడితే ఇంజిన్‌కు నష్టం కలగవచ్చన్న విశ్లేషణల నేపథ్యంలో, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు రద్దవుతాయన్న వదంతులు వైరల్ అయ్యాయి. అయితే ఇలాంటి కారణాలపై క్లెయిమ్‌లు తిరస్కరించబోమని బీమా కంపెనీలు స్పష్టం చేశాయి.
ఐసీఐసీఐ లాంబార్డ్ సహా పలు బీమా సంస్థలు, ఇంధన రకం క్లెయిమ్‌కు సంబంధం లేదని తెలిపాయి. ప్రమాదాలు, దొంగతనాలు, థర్డ్ పార్టీ నష్టాల ఆధారంగా మాత్రమే బీమా క్లెయిమ్‌లు మంజూరవుతాయని, ఇంజిన్ ధ్వంసం వంటి అంశాలు సాధారణ పాలసీలో ఉండవని, వాటికి యాడ్-ఆన్ కవర్లు అవసరమని నిపుణులు వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!