
జనరల్

రాయల్ ఎన్ఫీల్డ్ అంతర్జాతీయ ఆటోమొబైల్ రంగంలో భారీ విజయాన్ని సాధించింది. తాజా బ్రాండ్ ఫైనాన్స్ 2026 నివేదిక ప్రకారం, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆటోమొబైల్ బ్రాండ్ల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో టయోటా మొదటి స్థానంలో, బీఎండబ్ల్యూ రెండో స్థానంలో నిలిచాయి. ఫెరారీ, ఆడీ వంటి ప్రముఖ బ్రాండ్లను వెనక్కి నెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ ఈ ఘనత సాధించడం విశేషంగా నిలిచింది.
రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ విలువ 30 శాతం పెరగడం ఈ విజయానికి ప్రధాన కారణంగా పేర్కొనబడింది. ఇదే జాబితాలో టాటా మోటార్స్ ఐదో స్థానంలో, మహీంద్రా అండ్ మహీంద్రా 25వ స్థానంలో, మారుతి సుజుకి 34వ స్థానంలో నిలిచాయి. దీంతో ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో భారత కంపెనీల ప్రభావం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!