
గాసిప్స్

భారత రిజర్వ్ బ్యాంక్ మరోసారి ప్రజలకు శుభవార్త అందించింది. కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. తాజా నిర్ణయంతో రెపో రేటు 5.25 శాతానికి చేరింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత ఈ వివరాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
ఈ ఏడాదిలో ఇది ఆర్బీఐ ప్రకటిస్తున్న నాల్గో వడ్డీ కోత. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో ఒక్కోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించగా, జూన్లో 50 పాయింట్ల భారీ కోత విధించింది. తాజా నిర్ణయంతో 2025 లో మొత్తం 1.25 శాతం మేర రెపో రేటు తగ్గింది.
వడ్డీ రేట్లు తగ్గడంతో గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యాపార రుణాలకు కొంత ఉపశమనమే లభించనుంది. ఆర్థిక కార్యకలాపాలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!