

ఆర్బీఐ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల బోర్డులకు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం యూసీబీ బోర్డులో ఒక వ్యక్తి వరుసగా 10 సంవత్సరాలకు మించి డైరెక్టర్గా కొనసాగడానికి అవకాశం ఉండదు. అలాగే పదవీకాలం పూర్తయిన తర్వాత మళ్లీ అదే బ్యాంకు బోర్డులోకి రావాలంటే తప్పనిసరిగా మూడేళ్ల విరామ కాలాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
కొన్ని బ్యాంకుల్లో డైరెక్టర్లు తాత్కాలికంగా రాజీనామా చేసి, తక్కువ వ్యవధిలోనే మళ్లీ ఎన్నికవుతూ చట్టపరమైన పరిమితులను దాటుతున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయడానికే కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపింది. విరామ కాలంలో సంబంధిత వ్యక్తి ఆ బ్యాంకుతో కేవలం ఖాతాదారు లేదా సభ్యుడిగా మాత్రమే ఉండాలని పేర్కొంది. ఇదే తరహా మార్గదర్శకాలను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా ఆర్బీఐ జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!