

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–అమెరికా మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సరదాగా వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై అమెరికా జీరో టారిఫ్‌లు విధించి ఉంటే, క్రికెట్ మ్యాచ్‌లో కూడా అమెరికా జట్టే గెలిచేదని ఆయన హాస్యంగా అన్నారు. భారత్–అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఇటీవల కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం భారత్ ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాలను 18 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇచ్చిన విందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా జట్టుకు విజయం దక్కకపోయినా, వారి ఆటతీరు మాత్రం అద్భుతంగా ఉంది. క్రికెట్‌పై పెద్దగా అనుభవం లేకపోయినా, కొన్నేళ్ల క్రితమే ఆటను ప్రారంభించిన ఈ జట్టు మంచి ప్రదర్శన చేసింది. సెర్గియో ఈ మ్యాచ్‌ను ఎంతో ఆస్వాదించారు. 18 శాతం సుంకాలు లేకపోయి ఉంటే, గెలిచే వాళ్లమని ఆయన అప్పుడేమో అనుకుని ఉండొచ్చు. నా తరఫున ఒక సూచన – భారత్‌పై అమెరికా జీరో టారిఫ్‌లు విధించి ఉంటే, మీ టీమ్ ఈ మ్యాచ్‌ను గెలిచిఉండేది. ఏదేమైనా, అమెరికా జట్టు ప్రదర్శన నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా శనివారం రాత్రి ముంబయి వేదికగా భారత్, అమెరికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ 29 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించి టోర్నీకి శుభారంభం చేసింది. చివరివరకు పోరాడిన అమెరికా జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయినా, వారి ఆటతీరు ప్రశంసలు అందుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!