

ఫోన్‌పే ఐపీఓకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వాల్‌మార్ట్ మద్దతుతో పనిచేస్తున్న ఈ ఫిన్‌టెక్ సంస్థ ఇప్పటికే సెబీ నుంచి అనుమతి పొందింది. అయితే ప్రస్తుత మార్కెట్ ఒడుదొడుకుల కారణంగా లిస్టింగ్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని కంపెనీ సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. మార్కెట్ పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఐపీఓ ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
2016లో ప్రారంభమైన ఫోన్‌పే ప్రస్తుతం భారతదేశంలో అగ్రగామి డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌గా ఎదిగింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి ఈ యాప్‌కు సుమారు 65 కోట్ల రిజిస్టర్డ్ వినియోగదారులు, 4.7 కోట్ల మర్చంట్లు ఉన్నారు. డిజిటల్ చెల్లింపులతో పాటు ఇన్సూరెన్స్ అగ్రిగేటర్‌గా కూడా సేవలు అందిస్తోంది. అలాగే షేర్‌మార్కెట్ స్టాక్ బ్రోకింగ్ యాప్, ఇండస్ యాప్ స్టోర్ వంటి సేవలను కూడా నిర్వహిస్తోంది. ఐపీఓ ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా నిధులు సమీకరించాలని కంపెనీ భావించింది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఐపీఓను తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం మరో 141 కంపెనీలు కూడా ఐపీఓలకు అనుమతులు పొంది మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!