

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో లాంఛనంగా ప్రవేశిస్తూ తన తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం ఈ విటారాను ఆవిష్కరించింది. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఓనర్షిప్ ప్లాన్ కింద దీని ప్రారంభ ధర రూ 10.99 లక్షలు. బ్యాటరీ వినియోగ ఛార్జీ కిలోమీటరుకు రూ 3.99గా నిర్ణయించింది. 61 కేడబ్ల్యూహెచ్ మరియు 49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభించే ఈ విటారా ఒక్కసారి పూర్తి చార్జ్‌తో 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ప్రారంభ దశలో కొనుగోలు చేసిన వారికి ఏడాది పాటు డీలర్ లొకేషన్లలో ఉచిత చార్జింగ్ సౌకర్యం అందించనుంది. అలాగే మూడు సంవత్సరాల ఓనర్షిప్ ప్లాన్‌తో 60 శాతం వరకు అష్యూర్డ్ బైబ్యాక్ ఆప్షన్ కూడా కల్పిస్తోంది.
అదనంగా 7.4 కేడబ్ల్యూ ఏసీ వాల్ బాక్స్ చార్జర్ మరియు ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను కస్టమర్లకు అందించనుంది. ఈ ప్రారంభ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. రూ 21,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, ఈవీ వినియోగంలో ఉన్న అవరోధాలను తొలగించేందుకు పబ్లిక్ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, ఆఫ్టర్ సేల్స్ సేవా నెట్వర్క్ వంటి అంశాలను బలోపేతం చేసిన తర్వాతే వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చామని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!