

స్కోడా ఆటో ఇండియా దేశవ్యాప్తంగా తన వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టింది. 2026లో కొత్తగా 35 కస్టమర్ టచ్పాయింట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ దేశంలోని 182 నగరాల్లో మొత్తం 330 టచ్పాయింట్స్ను నిర్వహిస్తోంది. కొత్తగా ప్రారంభించనున్న కేంద్రాల్లో నాలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో కలిపి 19 టచ్పాయింట్స్ను స్కోడా నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లో కంపెనీకి 12 శాతం మార్కెట్ వాటా ఉందని పేర్కొన్నారు. 2025లో 73 వేలకుపైగా కార్లను విక్రయించిన స్కోడా.. ఈ ఏడాది 8-10 శాతం విక్రయాల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కంపెనీ వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!