అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ ‘బ్లాక్’ 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ జాక్ డోర్సే వెల్లడించారు. కృత్రిమ మేధస్సు సాధనాలు సంస్థల పనితీరును గణనీయంగా మార్చుతున్నాయని, తక్కువ సిబ్బందితోనే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చాలా సంస్థలు ఈ మార్పును ఆలస్యంగా గుర్తించాయని కూడా వ్యాఖ్యానించారు. కంపెనీ చరిత్రలో తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయాల్లో ఇదొకటని పేర్కొంటూ, తొలగించిన ఉద్యోగులకు 20 వారాల వేతనం, ఆరు నెలల ఆరోగ్య భద్రతా సదుపాయం అందిస్తామని, కొత్త ఉపాధి పొందేందుకు సహకరిస్తామని చెప్పారు.
ఈ ప్రకటన అనంతరం బ్లాక్ సంస్థ షేర్లు గణనీయంగా పెరిగాయి. ఎక్స్టెండెడ్ ట్రేడింగ్‌లో ఒక్కో షేరు ధర 24 శాతం కంటే ఎక్కువ పెరిగినట్లు సమాచారం. జాక్ డోర్సే ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన 2009లో స్క్వేర్ సంస్థను స్థాపించగా, 2021లో దానికి బ్లాక్‌గా పేరు మార్చారు. సంస్థ వినియోగిస్తున్న బ్లాక్‌చెయిన్ సాంకేతికతను ప్రతిబింబించేలా ఈ పేరు మార్పు చేసినట్లు పేర్కొన్నారు.




















.png&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!