

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, జాతీయ అవార్డు గ్రహీత, సినీ గీత రచయిత కాసర్ల శ్యామ్‌కు అభివాదం చేయగా శ్యామ్ ఆయనకు ఆశీస్సులు అందించిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా స్టూడియోలో అనిరుధ్, కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వీ సినిమాస్ సోషల్ మీడియాలో పంచుకుంది. చిత్ర రెండో సింగిల్ త్వరలో విడుదల కానుందని, సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుందని తెలిపింది.
‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని ‘జడల్’ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. మురికివాడల నేపథ్యంలో సాగే కథలో వివక్షకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా ఆయన పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ‘బలగం’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న కాసర్ల శ్యామ్.. అనిరుధ్ స్వరకల్పనలో పాటలకు సాహిత్యం అందిస్తుండటంతో రెండో సింగిల్‌పై ఆసక్తి పెరిగింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంగ్లిష్, స్పానిష్, బెంగాలీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!