

న్యాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ కీలక ముందడుగు వేసింది. న్యాయవాదులు, లా ఫర్మ్‌లు, కార్పొరేట్ లీగల్ విభాగాల కోసం ‘జెమినీ ఎంటర్‌ప్రైజ్ ఫర్ లీగల్’ పేరుతో ప్రత్యేక ఏఐ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రొటీన్ పనులతో పాటు క్లిష్టమైన న్యాయపరమైన వర్క్‌ఫ్లోలను ఆటోమేట్ చేయడం ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన ఉద్దేశం. లీగల్ సాఫ్ట్‌వేర్, డేటా ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం చేసుకునేందుకు ప్రత్యేక ప్లగిన్లు కూడా ఇందులో ఉన్నాయి.
రెగ్యులేషన్లను పర్యవేక్షించడం, డేటా డిస్కవరీ, కాంట్రాక్ట్‌ల పరిశీలన, కాంట్రాక్ట్ నెగోషియేషన్, పత్రాల్లో సున్నితమైన సమాచారాన్ని తొలగించడం, ఎన్‌డీఏ డాక్యుమెంట్ల తయారీ వంటి పనులను ఈ ఏఐ టూల్స్ నిర్వహించగలవు. థామ్సన్ రాయిటర్స్, హార్వే, లెగోరా వంటి లీగల్ టెక్ ప్లాట్‌ఫామ్‌లతోనూ సురక్షితంగా అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. లీగల్ రంగంతో పాటు త్వరలో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇతర పరిశ్రమల కోసం కూడా ప్రత్యేక ఏఐ టూల్స్‌ను విడుదల చేయనున్నట్లు గూగుల్ తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!