

అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో భారతీయులు ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ పొదుపులపై దృష్టి పెడుతున్నారని కాంటార్ తాజా సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది తమ భవిష్యత్ అవసరాలు, కుటుంబ భద్రత కోసం మరింత పొదుపు చేయాలని భావిస్తున్నారు. అలాగే 65 శాతం మంది పెరుగుతున్న ధరల కారణంగానే ఖర్చులను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాల ప్రయోజనం కలిగించే కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
మే నెలలో 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల 1,684 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని కేవలం 48 శాతం మంది మాత్రమే భావించగా, జనవరిలో ఈ సంఖ్య 60 శాతంగా నమోదైంది. మరో 61 శాతం మంది తమ పొదుపులు, పెట్టుబడుల విలువ 2025 స్థాయిలోనే కొనసాగవచ్చని లేదా తగ్గవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 39 శాతం మంది మాత్రమే పెట్టుబడుల విలువ పెరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులపై 85 శాతం, జీవన వ్యయాల పెరుగుదలపై 80 శాతం, అద్దె లేదా రుణ వాయిదాల చెల్లింపులపై 71 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!