

అమెరికా తాజాగా రోస్నెఫ్ట్, లుకోయిల్‌పై ఆంక్షలు ప్రకటించే ముందు, భారత్ అక్టోబర్‌లో రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కోసం సుమారు €2.5 బిలియన్లు ఖర్చు చేసింది. ఇది సెప్టెంబర్‌లో చేసిన ఖర్చుతో సమానమే అని ఎనర్జీ రీసెర్చ్ సంస్థ CREA తెలిపింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు పెరుగుతున్నా కూడా, చైనా తర్వాత రష్యా ఇంధనాలను అత్యధికంగా కొనుగోలు చేసే దేశంగా భారత్ కొనసాగింది. అమెరికా అక్టోబర్ 22న విధించిన ఆంక్షల కారణంగా రిలయన్స్, హెపిసిఎల్-మిట్టల్, మంగళూరు రిఫైనరీ వంటి సంస్థలు తాత్కాలికంగా దిగుమతులు నిలిపాయి.
అక్టోబర్‌లో రష్యా సుమారు 60 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ సరఫరా చేసింది, అందులో రోస్నెఫ్ట్ మరియు లుకోయిల్ 45 మిలియన్ బ్యారెల్లు పంపాయి. CREA వివరాల ప్రకారం, భారత దిగుమతుల్లో 81% క్రూడ్ ఆయిల్, 11% బొగ్గు, 7% ఆయిల్ ప్రొడక్టులు ఉన్నాయి. 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరప్ డిమాండ్ తగ్గడంతో, భారీ డిస్కౌంట్ల కారణంగా భారతదేశం రష్యా చమురు కొనుగోళ్లు వేగంగా పెరిగాయి. అతి తక్కువ సమయంలో, రష్యా చమురుపై భారత్ ఆధారం 1% కన్నా తక్కువ నుంచి దాదాపు 40% వరకు పెరిగింది. అక్టోబర్‌లో రష్యా నుంచి క్రూడ్ దిగుమతులు 11% పెరిగాయి. ప్రైవేట్ రిఫైనరీలు ఎక్కువ భాగం కొనుగోళ్లు చేసినప్పటికీ, ప్రభుత్వ రిఫైనరీలు కూడ తమ దిగుమతులను దాదాపు రెట్టింపు చేశాయి.
గుజరాత్‌లోని వదినార్ రిఫైనరీ అక్టోబర్‌లో 90% సామర్థ్యంతో పనిచేసింది. జూలైలో యూరోపియన్ యూనియన్ ఆంక్షల తర్వాత ఈ రిఫైనరీ పూర్తిగా రష్యా చమురపైనే ఆధారపడుతోంది. అక్టోబర్‌లో వీరి దిగుమతులు 32% పెరిగి, యుద్ధం ప్రారంభం తర్వాత అత్యధిక స్థాయికి చేరాయి. అయితే, రిఫైనరీ నుంచి ఎగుమతులు గత ఏడాదితో పోల్చితే 47% తగ్గాయి. రష్యా క్రూడ్‌ను ఉపయోగిస్తున్న భారత–టర్కీ రిఫైనరీల నుంచి ఫ్యూయల్ కొనుగోళ్లు ఆంక్షలు అమలు చేస్తున్న దేశాల్లో 8% తగ్గాయి. యూరోపియన్ యూనియన్, యుకే వరుసగా 9% మరియు 73% తగ్గించగా, ఆస్ట్రేలియా 140%, అమెరికా 17% పెంచాయి. ఈ రెండు దేశాలు రష్యా చమురు నుంచి తయారయ్యే ఇంధనాలపై నిషేధం ప్రకటించలేదు.
యుద్ధం తర్వాత రష్యా భారీ డిస్కౌంట్లతో కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రయత్నించింది. కొన్ని సందర్భాల్లో ఈ డిస్కౌంట్ బ్యారెల్‌కు $18–$20 వరకు ఉండేది. అయితే అక్టోబర్‌లో తగ్గి, యురాల్స్ క్రూడ్ బ్రెంట్‌తో పోల్చితే $4.92 తక్కువగా మాత్రమే ఉంది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!