
న్యూస్

అమెరికాకు చెందిన ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ భారత్‌లో మరో కీలక రికార్డును నమోదు చేసింది. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్యంగా భారత్‌లో ఐఫోన్ల తయారీ కొనసాగిస్తున్న యాపిల్.. గత ఏడాది దేశీయ మార్కెట్ నుంచి రూ.3 లక్షల కోట్లకు పైగా ఆదాయాన్ని సాధించింది.
ఈ ఆదాయంతో టర్నోవర్ పరంగా దేశంలోని అతిపెద్ద తయారీ సంస్థల జాబితాలో యాపిల్ రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం రూ.3.49 లక్షల కోట్ల మార్కెట్ ఆదాయంతో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్ విభాగం అగ్రస్థానంలో నిలిచింది.
ఇక తర్వాతి స్థానాల్లో హిందాల్కో రూ.2.61 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉండగా, టాటా స్టీల్ రూ.2.25 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా రూ.1.86 లక్షల కోట్ల మార్కెట్ ఆదాయంతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!