
షోస్

సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద మంచి జోరును కొనసాగిస్తోంది. ముఖ్యంగా నిజాం ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల పరంగా సత్తా చాటుతోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఐదో రోజు తెలంగాణలో రూ.1.87 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, ఆరో రోజు రూ.1.49 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. దీంతో నిజాం ప్రాంతంలో సినిమా మొత్తం గ్రాస్ దాదాపు రూ.20 కోట్లకు చేరుకుంది.
నిజాంలో సూర్యకు ఇది డ్రీమ్ రన్‌గా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ‘జైలర్’ వంటి రజనీకాంత్ చిత్రాల తర్వాత నిజాం ప్రాంతంలో ఓ తమిళ స్టార్ హీరో సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషంగా చెబుతున్నారు. తొలి వారం పూర్తయ్యే సమయానికి రూ.20 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవడంతో పాటు.. ఇదే జోరు కొనసాగితే మరింత మెరుగైన వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!