
గాసిప్స్

భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో అమెరికా నుంచి దిగుమతయ్యే ప్రీమియం మోటార్‌సైకిళ్లపై భారత్ భారీగా దిగుమతి సుంకాలను తగ్గించింది. 800 సీసీ నుంచి 1600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్‌లపై ఇకపై ఎలాంటి దిగుమతి సుంకాలు ఉండబోవడంతో హార్లే డేవిడ్సన్ వంటి కంపెనీలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ఒప్పందంపై అధికారిక సంతకాలు పూర్తయిన తర్వాత కొత్త సుంకాల విధానం అమల్లోకి రానుంది.
ఇదే సమయంలో అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని కార్లపై కూడా భారత్ సుంకాలను తగ్గించింది. అయితే ఎలక్ట్రిక్ కార్లను ఈ ట్రేడ్ డీల్ నుంచి మినహాయించడంతో టెస్లాకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. మరోవైపు దేశీయ ఆటోమొబైల్ సంస్థలకు మాత్రం ఈ నిర్ణయం కొంత ఊరటగా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!