
ఓటీటీ

భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని సంస్థకు చెందిన థర్డ్ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో నెట్‌వర్కింగ్ పరికరాలు షట్‌డౌన్ అయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో క్లౌడ్ సేవలకు ఆటంకం ఏర్పడినట్లు క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ వెల్లడించింది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ అంతరాయం కారణంగా ఢిల్లీ, చెన్నై, ముంబయి సహా పలు నగరాల్లో నెట్‌వర్క్ ట్రాఫిక్ ప్రభావితమైంది. పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని సంస్థ తెలిపింది. క్లౌడ్ ప్రొవైడర్లలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్‌తో గూగుల్ క్లౌడ్‌కు గట్టి పోటీ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!