
సినిమాలు

జెట్ ఇంధన ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ నెల 15 నుంచి టికెట్ ధరలను సుమారు 5 శాతం తగ్గించినట్లు ఎయిర్ ఏషియా ఎక్స్ ప్రకటించింది. ఇంధన ధరలను ప్రతి వారం సమీక్షించి అవసరానికి అనుగుణంగా ఛార్జీలను సవరించనున్నట్లు సీఈఓ బో లింగం తెలిపారు.
గతంలో మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఏప్రిల్‌లో కొన్ని మార్గాల్లో టికెట్ ధరలు 30 నుంచి 40 శాతం వరకు పెరిగాయి. తాజాగా అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందంతో సింగపూర్ జెట్ ఇంధన ధర బ్యారెల్‌కు 242 డాలర్ల నుంచి 112 డాలర్లకు తగ్గింది. దీంతో సంస్థ నష్టదాయక మార్గాలను నిలిపివేసి, వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఆగస్టు నాటికి పూర్తిస్థాయి సేవలను పునరుద్ధరించాలనే లక్ష్యంతో పాటు, వచ్చే ఏడాది నుంచి ఏ321ఎల్ఆర్ విమానాలు, 2027 నాటికి ఏ220 విమానాలను ప్రవేశపెట్టనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!