

భారత క్రికెట్‌లో యువ ప్రతిభకు కొదవ లేదని మరోసారి రుజువైంది. ఐపీఎల్, అండర్-19 ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ తర్వాత ఇప్పుడు అతని సహచరుడు దీపేశ్ దేవేంద్రన్ తన వేగవంతమైన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 18 ఏళ్ల ఈ యువ పేసర్ అండర్-19 ప్రపంచకప్‌లో నిలకడైన ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన స్పీడ్‌తో భారత క్రికెట్‌కు మరో ఆశాజనక ఫాస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడు.
ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో మధురై పాంథర్స్ తరఫున ఆడుతున్న దీపేశ్, ట్రిచీ గ్రాండ్ చోళాస్పై జరిగిన మ్యాచ్‌లో గంటకు 146 కి.మీ వేగంతో బంతి సంధించి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా తన స్పెల్ మొత్తం 140+ కి.మీ వేగాన్ని నిలబెట్టుకోవడం విశేషం. అతని బౌలింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, భారత జట్టుకు మరో భవిష్యత్ స్పీడ్ స్టార్ దొరికాడంటూ అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!