
క్రీడలు

కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి 10 శాతానికి రెట్టింపు చేసింది. ఈ కొత్త కస్టమ్స్ డ్యూటీ నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. దీంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ప్రధాని బంగారం కొనుగోలు తగ్గించుకోవాలని సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
2025 - 26 లో భారత్లో బంగారం దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయని సమాచారం. ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశంగా ఉంది. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకం పెంపుతో సామాన్య వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!