

భారత్‌లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన ధరలు నేడు స్వల్ప పెరుగుదలతో కొనసాగాయి. ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,890కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,400గా నమోదైంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,420గా ఉంది.
తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం పట్టణాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,890గా, 22 క్యారెట్ల ధర రూ.1,37,400గా, 18 క్యారెట్ల ధర రూ.1,12,420గా కొనసాగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం నగరాల్లో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,000గా ఉండగా, న్యూఢిల్లీలో రూ.1,50,040గా నమోదైంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణెలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,890గా ఉంది. అహ్మదాబాద్‌లో రూ.1,49,940 కాగా, జైపూర్, లఖ్నవూలో రూ.1,50,040గా నమోదైంది.
గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!