
క్రీడలు

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి రూ.1,59,490కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గి రూ.1,46,200కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ మార్పులు, కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావంతో బంగారం ధరలు తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇక వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,95,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్, పరిశ్రమల అవసరాల కారణంగా వెండి ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!