

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి 2027 మే నెలలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నూతన ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్ తన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్ సేవల కోసం హైదరాబాద్‌కు చెందిన జీఎంఆర్ ఏరో టెక్నిక్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ) ఒప్పందం జరిగింది. విమానయాన కార్యకలాపాలు ప్రారంభించే ముందు అవసరమైన సాంకేతిక సేవల ఏర్పాటులో ఈ ఒప్పందం కీలక ముందడుగుగా నిలవనుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎయిర్ ఇండో సీఈవో శ్రీనివాస్ చిలుకూరి శుక్రవారం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి కార్యకలాపాలు, సాంకేతిక సామర్థ్యాలు, విమానాల నిర్వహణ సేవలను ఆయన పరిశీలించారు. సంస్థ అందిస్తున్న సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి నుంచి విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా ఎయిర్ ఇండో చేపడుతున్న సన్నాహాలకు ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!