

డాలర్ కరెన్సీ బలపడటంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఫెడ్ రేట్ కోతపై ఆశలు సన్నగిల్లుతుండటంతో పసిడి ధరలు మరింత తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: డాలర్ బలపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫెడ్ రేట్లో కోతపై ఆశలు సన్నగిల్లడంతో పసిడి ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ప్రతిబింబిస్తూ భారత్‌లో కూడా బంగారం ధరలు దిద్దుబాటుకు లోనవుతున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నవంబర్ 5 బుధవారం ఉదయం 6.30 గంటల సమయానికి, దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర ₹1,22,540గా ఉంది. నిన్నటితో పోలిస్తే సుమారు ₹800 మేర ధర తగ్గింది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర ₹1,12,450 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల్లో కూడా భారీగా కోత పడింది. కిలో వెండి ధర ₹3,200 మేర తగ్గి ₹1,50,900కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర $3,969 వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్ సూచీ 0.12% పెరిగి 99.99కు చేరుకుంది. ఇది గత మూడు నెలల్లో గరిష్ట స్థాయి. దీంతో పసిడి, వెండి ధరలు దిగొస్తున్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ వారమంతా బంగారం ధరల్లో దిద్దుబాట్లు కొనసాగవచ్చని భావిస్తున్నారు.
చెన్నై: ₹1,22,720; ₹1,12,490; ₹93,890
ముంబై: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
ఢిల్లీ: ₹1,22,500; ₹1,12,390; ₹91,980
కోల్‌కతా: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
బెంగళూరు: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
హైదరాబాద్: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
విజయవాడ: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
కేరళ: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
పూణే: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
వడోదరా: ₹1,22,500; ₹1,12,290; ₹91,880
అహ్మదాబాద్: ₹1,22,500; ₹1,12,290; ₹91,880
చెన్నై: ₹1,64,900
ముంబై: ₹1,50,900
ఢిల్లీ: ₹1,50,900
కోల్‌కతా: ₹1,50,900
బెంగళూరు: ₹1,50,900
హైదరాబాద్: ₹1,64,900
విజయవాడ: ₹1,64,900
కేరళ: ₹1,64,900
పూణే: ₹1,50,900
వడోదరా: ₹1,50,900
అహ్మదాబాద్: ₹1,50,900
గమనిక: పై పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారవచ్చు. ఈ వార్త రాసే సమయానికి ధరలు పైన పేర్కొన్న విధంగా ఉన్నాయి. బంగారం లేదా వెండి కొనుగోలు చేసేముందు తాజా ధరలను మరోసారి తనిఖీ చేయడం మంచిది.











కామెంట్స్ (1)
Big drop in gold rates!